వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. నర్సంపేటకు చెందిన భక్తుడు రంపిస ప్రణయ్ దర్శనం అనంతరం బయటకు వెళ్తుండగా ఆయన బంగారు బ్రేస్‌లెట్ పడిపోయింది. ఆలయం బయట పెలాలు అమ్ముకునే ఇద్దరు వ్యక్తులు ఆ బ్రేస్‌లెట్ తమదేనని చెప్పుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో, పదేళ్లుగా సోడా బండి వ్యాపారం చేస్తున్న కొంపల్లి రమేష్ ఆ బ్రేస్‌లెట్‌ను తీసుకొని ఆలయ సిబ్బందికి అప్పగించారు.