వేములవాడ కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా రజాక్ నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మహమ్మద్ అబ్దుల్ రజాక్ నియమితులయ్యారు. సోమవారం సిరిసిల్లలో వి. హనుమంతరావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు రియాజ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీ విభాగం అభివృద్ధికి కృషి చేస్తానని అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕