ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరి

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయ స్వామి ఈవో నాగారపు శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాస్ 36 ఏళ్లుగా దేవాదాయ శాఖలో పనిచేసి ఈఓ స్థాయికి ఎదిగారని, పదవీ విరమణ తర్వాత కూడా దేవస్థానం అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, గతంలో నాంపల్లి, మామిడిపల్లి ఆలయాలను అభివృద్ధి చేశానని, ప్రస్తుతం రాజన్న ఆలయ అభివృద్ధి తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్