బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన నాయిని నరహరి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనతో బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం అండగా నిలిచింది. సర్పంచ్ కుంటెల్లి నాగరాజు 25 కిలోల బియ్యం, వెయ్యి రూపాయల నగదు అందజేశారు. అలాగే, సుద్దాల గ్రామ సర్పంచ్ జిన్నా అనూష అనిల్ కుమార్ కూడా 25 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాసంపెళ్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు జాగిరి కిరణ్, చిద్రవేని నరేష్, మోకేనపెల్లి బాలరాజు, అర్జున్ చందు, రాములు, వాసరయ్యతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్