రహ్ వీర్ పథకం ద్వారా రూ. 25 వేల పారితోషికం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి, వారి ప్రాణాలను కాపాడే పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం “రహ్ వీర్ పథకం”ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ. 25,000 నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందిస్తే అనేక ప్రాణాలు రక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్