జాతీయ ఐక్యత దినోత్సవం సందర్బంగా "రన్ ఫర్ యూనిటీ" కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రేపు ఉదయం 07:00 గంటలకు 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే తెలిపారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు, అలాగే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ రన్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యత, జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్