రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండలం దేగావత్ తండాకు చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కుసునోత్ బీరయ్య, గుగులోత్ బాలు, బిక్యా, రాజు, లక్క, తిరుపతి, భీమ, గజన్ లాల్, ప్రభాస్, పవన్, తిరుపతి, విజయ్ లతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని నూతనంగా చేరిన నాయకులు పేర్కొన్నారు.