తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ రాష్ట స్థాయి పోటీలలో భాగంగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం విద్యార్థులు 'మహాలక్ష్మి పథకం మరియు మహిళల ఆధ్యాత్మిక పర్యటన: వేములవాడ ఆలయ అధ్యయనం' అనే అంశంపై పరిశోధన చేపట్టారు. ప్రాజెక్ట్ సూపర్వైజర్ డాక్టర్ అప్పని ప్రసాద్ మార్గదర్శకత్వంలో, విద్యార్థులు వేములవాడ ఆలయానికి వచ్చిన మహిళా భక్తులు, స్థానిక వ్యాపారులను ప్రశ్నించి సమాచారం సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా, మహాలక్ష్మి పథకం మహిళల ఆధ్యాత్మిక పర్యటనలపై చూపే సంబంధం, ప్రభావాన్ని విశ్లేషించి, ఫలితాలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు డాక్టర్ ప్రసాద్ తెలిపారు.