సిరిసిల్ల: రోడ్డు భద్రత అందరి బాధ్యత

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా, జనవరి 31న సిరిసిల్ల పట్టణంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సుమారు 2000 మంది ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో మెగా ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మ ఘాట్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగంగా వెళ్లవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. ఈ దేశ భవిష్యత్తు పిల్లలేనని, రోడ్డు ప్రమాదాలు లేని భవిష్యత్తును నిర్మించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్