తెలంగాణలోని ప్రముఖ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆలయ వసతి గృహాలు, ధర్మశాలలు, పరిసరాల్లో తరచూ పాములు కనిపిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పార్వతిపురం ధర్మశాల కార్యాలయంలో నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో కలకలం రేగింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పాత భవనాలు, చెత్త పేరుకుపోవడం వల్ల పాములకు ఆశ్రయం లభిస్తోందని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. భక్తుల ప్రాణ భద్రతకు హామీ ఇవ్వాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.