రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి. గీతే నేతృత్వంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన పోలీసు అధికారులు ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రత్యేక నృత్యాలు, రంగులతో ఆకట్టుకునే దృశ్యాలు కనిపించాయి. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.