హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం భీమేశ్వర ఆలయంలోని ఆంజనేయ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నుంచి మేళ తాళాలతో అర్చకులు వేద పండితులు తరలివచ్చారు. స్వామివారికి చెందిన లేపానం పూసి. ప్రత్యేక తమలపాకు మాలలు వేసి అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.