రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినీపల్లి మండలంలోని వరదవెళ్ళి పాత గ్రామంలోని దత్తాత్రేయస్వామి ఆలయంలో బుధవారం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభువుగా వెలిసిన రాహుకేతు సర్పశయన దత్తాత్రేయ స్వామి ఆలయం చుట్టూ నీరు ఉండటంతో, భక్తులు పడవలో ప్రయాణిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారతదేశంలో ఇలాంటి ఆలయం మరొకటి లేదని అర్చకులు తెలిపారు. భక్తులు ఈ వింత అనుభూతిని పొందుతున్నారు.