జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వేముల చొక్కయ్య ఇటీవల గల్ఫ్ లో మరణించగా, వారి కుటుంబ సభ్యులను, కథలాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాయితి నాగరాజు మామ దయ్య నడిపి గంగారాం, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి తల్లి లక్ష్మి, బొమ్మెన గ్రామానికి చెందిన బైరా మురళి, పిడుగు గంగవ్వలు మరణించగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారి చిత్రాపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.