వేములవాడలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే పోటీల బ్రోచర్ ను బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ పోటీలు ఫిబ్రవరి 8న స్థానిక శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబడతాయని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీతలు, నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్