రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన బోరుగల్ల శంకర్ వాటర్ ట్యాంకర్ పై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ బోల్తా పడి మరణించారు. ఆయన కుటుంబం నిరుపేద కావడంతో, దహన సంస్కారాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడింది. బంధువుల అభ్యర్థన మేరకు, ట్రస్ట్ మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా దాతలు స్పందించి రూ. 11,500/- ఆర్థిక సహాయం అందించారు.