వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు రాజరాజేశ్వర స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. "అందరినీ చల్లగా చూడు రాజన్న, భీమన్న స్వామి" అంటూ భక్తజనం స్వామివార్లను వేడుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.