ఘనంగా స్వామివారి కళ్యాణం

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ తంతును తిలకించారు.

సంబంధిత పోస్ట్