వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అధ్యక్షులు కె. వి అనసూర్యలు మాట్లాడుతూ.. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.