అత్యంత వైభవంగా స్వామివార్ల రథోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణం, రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, హనుమాన్ స్వాములు హాజరై ప్రత్యేక నృత్యాలు చేసి స్వామివారి సేవలో తరించారు. LED లైట్స్, డీజే భక్తి పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తజనం స్వామివారిని చల్లగా చూడాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్