రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాటిరేవుల కార్యక్రమంలో పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కాట్రేవుల పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని, వ్యవసాయంలో రైతులకు చేదోడు వాదోడుగా నిలిచే ఎడ్లను అలంకరించి, వాటికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. రైతులు పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.