గత రాష్ట్ర ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు

గత రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వేరు అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ బొల్లారం వేములవాడ, సిరికొండ రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. CRIF నిధులు రూ. 23 కోట్లు మంజూరు చేశామని, గత ప్రభుత్వం కేంద్రంతో కలిసి పనిచేస్తే రాష్ట్రం అద్దంలా మెరిసేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్