నర్సింగాపూర్ లో నకిలీ బాబా సంచారం కలకలం రేపింది. వేములవాడ మండలంలోని వెంకటంపల్లి, అచ్చన్నపల్లి గ్రామాల్లో తిరిగిన అనంతరం శనివారం నర్సింగాపూర్ గ్రామానికి చేరుకున్న బాబా, ఓ కుల సంఘ భవనంలో ఆశ్రయం పొందారు. రాత్రి గ్రామంలో తిరుగుతూ పూజలు చేస్తానని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శనివారం రాత్రి బాబాను గ్రామం నుంచి తరలించారు. ఎస్సై జె. రమేష్ మాట్లాడుతూ, ప్రజలు నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దని సూచించారు.