203 మంది కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా

వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ 203 మంది మున్సిపల్ కార్మికులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కార్మిక లోకం హర్షం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చైర్మన్ పుల్కం రాజులకు మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ముప్పై ఏళ్ల శ్రమకు దక్కిన సామాజిక భద్రతగా దీనిని అభివర్ణించారు. పాలకవర్గానికి మరింత బాధ్యతగా పనిచేస్తామని కార్మికులు మాట ఇచ్చారు.

సంబంధిత పోస్ట్