రాజన్న ఆలయ అభివృద్ధి గురించి ప్రభుత్వ విప్ మాటలు ఇవే

వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆలయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ గర్భగుడి, పురాతన కట్టడాలను తాము ముట్టుకోవడం లేదని, కొందరు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్