రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు ఈ నెల 1వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నా ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూలీలు యోచిస్తున్నారు.