వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని అయిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత దేశ స్వతంత్ర పోరాటంలో అణగారిన వర్గాల నుండి ప్రాతినిథ్యం వహిస్తూ స్వరాజ్య స్వతంత్రంలో అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తుచేశారు.