మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గంలో ఆదివారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ, కోరుట్ల బస్ స్టాండ్ నుండి తిప్పపురం తెలంగాణ చౌక్ వరకు వందలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తప్పుడు కేసులతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. "కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు. తెలంగాణ కోట్లాది మంది గుండె చప్పుడు" అనే నినాదాలతో ఈ నిరసన చేపట్టారు. ఈ ప్రజాస్వామ్య పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చల్మెడ లక్ష్మి నరసింహారావు పిలుపునిచ్చారు.