వేములవాడ: మాజీ ఎమ్మెల్యే ఓటు తొలగింపు

గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు భారత పౌరుడు కాదని తీర్పును ఇవ్వడంతో ఆర్డీవో కార్యాలయం అధికారులు ఓటర్ల జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగిస్తున్నట్లు నోటీసును గత నెల రమేష్ బాబు గెస్ట్ హౌస్ ప్రధాన ద్వారం ముందు అంటించారు. వివరణ ఇవ్వకపోవడంతో శనివారం ఓటర్ల జాబితా నుంచి ఓటు హక్కును పూర్తిగా తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసును గెస్ట్ హౌస్ ముందు అతికించారు.

సంబంధిత పోస్ట్