వేములవాడ: కాంగ్రెస్ పార్టీలో చేరికలు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. మేడిపల్లి మండలం దమ్మన్నపేట మాజీ సర్పంచ్ కాచర్ల సురేష్, నాయకులు శేరు భూమేష్, మునుగోరి నారాయణ, మహేష్, నరేష్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, నాయకులు నగేష్, రాఘవ రెడ్డిలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్