తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలోని విఠలేశ్వర స్వామి వారికి అర్చకులు మహా పూజ నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామివార్లకు పంచోపనిషత్ ద్వారా అభిషేక పూజ కార్యక్రమాలు చేసినట్లు అర్చక స్వాములు వెల్లడించారు. ఈ పర్వదినాన స్వామివారిని పూజించిన.. దర్శించుకున్న.. పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయని అర్చకులు తెలిపారు.