వేములవాడ ఆలయం, పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రధాన ఆలయం నుండి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 ఫీట్ల రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రూ. 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం, రూ. 6.50 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.