వేములవాడ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వెంకటస్వామి నామినేషన్ దాఖలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 8వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా సాగరం వెంకటస్వామి శుక్రవారం  అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వార్డులోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీటి, డ్రైనేజీ, రోడ్ల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వెంకటస్వామి తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పని చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ నామినేషన్తో 8వ వార్డులో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది.

సంబంధిత పోస్ట్