దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న ఆలయంలో కార్తీక దీపోత్సవం అట్టహాసంగా జరిగింది. వరంగల్ భక్తురాలు స్నేహ స్వామివారిని దర్శించుకుని, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవంలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి.