మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. రైతుల కోసం జనవరిలో రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నామని చెప్పారు. నూతన పాలకవర్గానికి విషెష్ చెప్పారు.