సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బల్మూరి వెంకట్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే పరిశీలించారు. రగుడు బైపాస్ రోడ్డులో సభా స్థలం, జూనియర్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలం వరకు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ పకడ్బందీగా చేపట్టాలని ఆది శ్రీనివాస్ సూచించారు. అధికారులు స్టేజ్, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕