రాజన్న ఆలయ ఈవో రమాదేవికి వినతి పత్రం ఇచ్చిన కార్మికులు

వేములవాడ దేవస్థానం ఈవో రమాదేవిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు కలిసి తమ వేతనాలను కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా నేరుగా దేవాలయం ద్వారా చెల్లించాలని, తమను దేవాలయం ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ESI హాస్పిటల్ నిర్మించాలని, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, దేవాలయం ద్వారా ID కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్