సొంత అన్నను రాయితో కొట్టి చంపిన చెల్లెలు

AP: అనకాపల్లి జిల్లా పూడిమడకలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి గొడవల కారణంగా చెల్లెలు కోర్లమ్మ అనే మహిళ తన అన్న నూకరాజును రాయి కొట్టి చంపింది. తీవ్ర ఘర్షణలో కోపంతో కోర్లమ్మ అన్నపై దాడి చేయడంతో నూకరాజు అక్కడికక్కడే మరణించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్