ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వీరి ఆత్మహత్యకు కారణం కొరియన్ గేమ్స్ ఆడనివ్వకపోవడమేనని మృతుల తండ్రి కీలక విషయాలు వెల్లడించారు. 'నా కూతుళ్లు కొరియాకు తీసుకెళ్లమని అడిగేవారు. మనం ఇండియన్స్ అని చెబితే కోప్పడేవారు. ఒరిజినల్ పేర్లను అలిజా, సిండీ, మారియాగా మార్చేసుకున్నారు' అని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పిల్లలకు SM బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.