అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. అయోధ్య ట్రస్ట్ గత ఐదేళ్ల ఖాతాలపై సిట్ రీ-ఆడిట్ చేయనుంది. ముఖ్యంగా ట్రస్ట్‌లో నగదు నిల్వలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. విరాళాల లెక్కింపు ప్రక్రియపై కూడా సిట్ విచారణ చేయనుంది. నిర్మాణ పనులపై కూడా సిట్ అధికారులు మరోసారి తనిఖీ చేయనున్నారు.