విచారణకు రావాలని కేసీఆర్‌కు సిట్ నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి CRPC 160 కింద ఆయన పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసురీత్యా స్టేషన్‌కు రానక్కర్లేదని HYD పరిధిలో కోరిన చోట విచారణ చేస్తామని పేర్కొంది. అయితే కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి నందినగర్‌కు వస్తారా? సిట్ అధికారులు అక్కడికే వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది.

సంబంధిత పోస్ట్