TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో హైదరాబాద్ నందినగర్‌లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. సిట్ విచారణకు రావాలని ఆయన నివాసంలో నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో రేపు కేసీఆర్‌ను సిట్ విచారించనుందని సమాచారం. అయితే విచారణకు కేసీఆర్‌ను రమ్మంటారా? లేదా కేసీఆర్ వద్దకే సిట్ వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.