TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. అయితే విచారణలో భాగంగా అధికారులు KCRను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. 'ప్రభాకర్ రావు సర్వీసును ఎందుకు పొడిగించారు. ఆయనకే 2 పోస్టులెందుకు ఇచ్చారు. పార్టీ నిధులతో ట్యాపింగ్ పరికరాలు కొన్నారా' అని ప్రశ్నించినట్లు సమాచారం. BRSకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తోంది.