TG: నందినగర్‌లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. కేసీఆర్ ఇంటి రెండో అంతస్తులోనే విచారణ నిర్వహించనున్నారు. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరినే అనుమతించే అవకాశం ఉంది. పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి నివాసంలోకి ప్రవేశం నిరాకరించారు. కుటుంబ సభ్యుల్లో హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సిట్ విచారణను వీడియో రికార్డు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేసి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.