TG: గత ప్రభుత్వ హయాంలో ORR టోల్ టెండర్లను ప్రైవేటుకు అప్పగించడంపై సిట్‌తో విచారణ జరిపించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశించామని సీఎం తెలిపారు. ‘BRS హయాంలో ORRను అప్పనంగా అమ్మకున్నారు. దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ప్లాన్‌లో భాగంగా దీన్ని విక్రయించారు’ అని సీఎం ఆరోపించారు. కాగా, ORR టెండర్లపై తాను విచారణ కోరలేదని హరీశ్ చెప్పారు.