వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. శివ కార్తికేయన్ ఇప్పటికే పూరి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కథ చర్చలు కూడా పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే శివ కార్తికేయన్ ఎలాంటి కథకు ఓకే చెప్పారు? పూరి ఆయన కోసం 'పోకిరి' రేంజ్‌లో కొత్త కథను సిద్ధం చేశారా? అనే దానిపై చర్చ జరుగుతోంది.