ఆర్థిక స్థిరాభివృద్ధికి ఆరు కీలక అంశాలకు ప్రాధాన్యత: నిర్మలా సీతారామన్

యూనియన్ బడ్జెట్ 2026–27పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, నిలకడగా కొనసాగించడమే తొలి కర్తవ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ఆరు ప్రధాన రంగాల్లో ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. తయారీ రంగాన్ని విస్తరించడం, సంప్రదాయ పరిశ్రమలకు పునర్జీవం కల్పించడం, చాంపియన్‌ ఎంఎస్‌ఎంఈలను రూపొందించడం, మౌలిక సదుపాయాలకు బలమైన ఊపునివ్వడం, దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడం, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యమని నిర్మలా స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్