నిర్మాణంలో ఉన్న సెప్టెక్‌ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి

ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కలహాండి జిల్లాలోని కరియాఖుంటా గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు. ట్యాంక్‌లో పనిచేస్తుండగా విషవాయువులు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్