TG: HYD-కూకట్‌పల్లి పరిధిలోని కల్తీ కల్లు తాగిన ఘటనలో అనధికారికంగా ఆరుగురు మృతి చెందారని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, బాధితులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో బాధితుల పరిస్థితి బాధాకరంగా ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.