TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని వెంగళరావు కాలనీలో బుధవారం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరవ తరగతి చదువుతున్న భూక్యా మహేందర్ (12) అనే బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడంతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. బాలుడి మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.